కాలువ పనులు ప్రారంభించకుంటే దీక్ష
ఇల్లంతకుంట: రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ అనుబంధ ఎల్‌ఎం –6(లెఫ్ట్ మైనర్) అసంపూర్తి కాలువ పనులు ప్రారంభించకుంటే మార్చి 3వ తేదీన నిరాహార దీక్ష చేస్తామని ప్రభావిత రైతులు హెచ్చరించారు. ఈమేరకు రంగనాయక సాగర్ ప్రాజెక్టు డీఈ సీతారాంను కలిసి వినతిపత్రం సమర్పించారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు డీఈ సీతారాం.. దాచారం శివారు నుంచి చిన్న లింగాపురం శివారు మధ్య ఒక కిలోమీటర్ మేర నిలిచిపోయిన ఎల్‌ఎం – 6 కాలువ పనుల స్థల పరిశీలన కోసం మంగళవారం వచ్చారు. సమాచారం అందుకున్న పెద్ద లింగాపురం, రామాజీపేట, చెక్కుడువానిపల్లి గ్రామాల రైతులు డీఈ వద్దకు వెళ్లారు. కాలువ పనులు ఎందుకు సాగడం లేదని నిలదీశారు. నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. దీంతో ఆర్‌ఐ షఫీయుద్దీన్‌ను వెంటనే కాలువల వద్దకు రావాలని డీఈ ఆదేశించడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అసంపూర్తి పనులు, భూముల గురించి వివరణ అడిగారు. అయితే, అవి తమ పరిధిలో లేదని ఆర్‌ఐ వివరించారు. అసంపూర్తి పనులతో ఏడుగురు రైతులకు రూ.1.30 కోట్ల చెల్లింపులు ఆగిపోయాయని పెద్దలింగాపురం రైతులు అంటున్నారు. కార్యక్రమంలో రైతులు అమ్ముల అశోక్, ఎలవేణి రమేశ్, కరికే నవీన్, కమటం రవి, జి.మల్లేశం, వీఆర్వో సింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఎల్‌ఎం– 6 కెనాల్ రైతుల హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment