ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యార్థులు పట్టుదలతో చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి వై.శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొర్లపల్లి గ్రామ శివారులోని రాచర్ల జూనియర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న పరీక్షలకు ఇప్పటి నుంచే సంసిద్ధులు కావాలన్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో రాణించేందుకు మంచి మార్కులు సాధించాలని సూచించారు. గతేడాది కళాశాల నుంచి రాష్ట్ర, జిల్లా ర్యాంకులు సాధించిన విద్యార్థులు బహుమతులు అందజేశారు. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. కళాశాల ప్రిన్సిపాల్ శైలజ, చైర్మన్ ఐత వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఏలూరి రాజయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రణాళికతో ఉత్తీర్ణత సాధించాలి
కోనరావుపేట: విద్యార్థులు క్రమశిక్షణతో మంచి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. వార్షిక ఫలితాల్లో ప్రతిభ కనబర్చి కళాశాలకు గుర్తింపు తీసుకరావాలన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ప్రిన్సిపాల్ కేదారేశ్వర్, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు శరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment