ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్ ఎన్నికలకు దూరం
సిరిసిల్లటౌన్: ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని నిలుపలేదని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం సిరిసిల్లలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని అంటున్న కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 27న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన నరేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, వెలుము ల స్వరూప, గోనె ఎల్లప్ప, కోడం అమర్నాథ్, గుండ్లపల్లి గౌతం, నేరెళ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment