
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు తల్లీకూతుళ్ల ఎంపిక
కరీంనగర్‌స్పోర్ట్స్: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన తల్లీకూతుళళ్లు ప్రతిభ కనబరిచారు. తల్లి మేరీ స్టెల్లా 50 ఏళ్ల పైన వయసు విభాగంలో జావెలీన్ త్రో, షాట్‌పుట్ పోటీల్లో బంగారు, 100 మీటర్ల రన్నింగ్‌లో రజత పతకం సాధించింది. కూతురు షీలా స్మృతి 30 ఏళ్ల పైన వయసు విభాగంలో 100 మీటర్ల రన్నింగ్‌లో రజత, 200 మీటర్ల రన్నింగ్‌లో కాంస్య పతకాలు గెలిచింది. తల్లీకూతురు ఏప్రిల్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని సంఘం రాష్ట్ర కార్యదర్శి రామారావు, రుబేన్ మార్క్, సుధీర్, దేవదానం, డేనియల్, సుదర్శన్, జాన్సన్ తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment