
పిచ్చికుక్కల దాడిలో ఐదుగురికి గాయాలు
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండల కేంద్రంతోపాటు తిమ్మాపూర్‌కు చెందిన ఐదుగురిపై బుధవారం పిచ్చికుక్కలు దాడి చేశాయి. తిమ్మాపూర్‌కు చెందిన ఎడ్ల సత్తయ్య(52), చందుర్తికి చెందిన పవన్‌సాయి(11), రోషణ్(7), దీక్షిత(5), దాసరి అమృత(65)లపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. వీరికి చందుర్తి పీహెచ్‌సీలో చికిత్స చేసి వేములవాడ ఆస్పత్రికి తరలించారు.
సీతారాంపూర్ గ్రామంలో నలుగురికి..
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సీతారాంపూర్ గ్రామంలో పిచ్చికుక్కదాడిలో నలుగురు గాయపడ్డారు. మంగళవారం రాత్రి రోడ్డు వెంట వెళ్తున్న హన్మాండ్ల జయ్‌పాల్‌రెడ్డి, నారాయణపురం భాగ్య, ముసాపురి శ్రీనివాస్, బొట్ల శిరీష, బొట్ల చంద్రయ్యలపై పిచ్చికుక్క దాడిచేసింది. నారాయణపురం సమ్మయ్య, చామకూర ప్రకాశ్‌రెడ్డికి చెందిన పశువులపై దాడి చేసింది. బాధితులు బుధవారం చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment