
తాడిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడి మృతి
గన్నేరువరం: మండలంలోని జంగపల్లి గ్రామానికి చెందిన ముత్యం ధర్మయ్యగౌడ్(59) ప్రమాదవశాత్తు తాడిచెట్టు నుంచి పడి మృతి చెందాడు. ఎస్సై తాండ్ర నరేశ్ వివరాల ప్రకారం.. ధర్మయ్యగౌడ్ కొత్త తాటిచెట్లను కల్లు కోసం సిద్ధం చేసేందుకు జంగపల్లి– పీచుపల్లి గ్రామాల మధ్య ఉన్న తాటివనానికి వెళ్లాడు. తాటిచెట్టు సగం వరకు ఎక్కగా.. ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు. భార్య విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
కమాన్‌పూర్(మంథని): జూలపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన బొడ్డుపల్లి రాజమల్లు(51) మృతి చెందాడు. రాజమల్లు సైకిల్‌పై ఇసీ్త్ర చేసిన దుస్తువులను యజమానికి ఇవ్వడానికి వెళ్తుండగా మూలమలుపు వద్ద ఎదురుగా వచ్చిన టాటాఏస్ ట్రాలీ ఢీకొంది. ఈప్రమాదంలో రాజమల్లుకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు బొడ్డుపల్లి పూర్ణచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసుకున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి..
సిరిసిల్లక్రైం: సిరిసిల్ల పట్టణంలోని విజయలక్ష్మి పారాబాయిల్డ్ రైస్‌మిల్లు వెనుక భాగంలో గుర్తుతెలియని వ్యక్తి(36) మృతిచెంది ఉన్నాడు. సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపిన వివరాలు. రైస్‌మిల్లు వెనుకభాగంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సంఘటన స్థలంలో పరిశీలించగా హత్య చేసినట్లుగా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. తలపై బలంగా బాధడంతోనే మృతిచెందినట్లు పోలీసులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. మృతుడి వివరాలు తెలియలేదన్నారు.
మహిళ మెడలోంచి పుస్తెలతాడు చోరీ
వేములవాడఅర్బన్: రాజన్న దర్శనానికి కాలినడకన వస్తున్న భక్తురాలి మెడలోంచి పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లాడు. వివరాలు వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. సిరిసిల్ల శివారులోని చంద్రపేటకు చెందిన మంజుల రాజన్న దర్శనానికి మంగళవారం రాత్రి కాలినడకన నడుచుకుంటూ వస్తోంది. వేములవాడ–సిరిసిల్ల ప్రధాన రహదారిలోని గుర్రవానిపల్లి, నందికమాన్ మధ్యలో గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోంచి మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనం చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని బుడిగజంగాలకాలనీలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. ట్రాలీ ఆటోలో వచ్చి అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

తాడిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment