
గ్రామాల్లో మళ్లీ స్వచ్ఛబాట
కరీంనగర్‌రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యం, పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తూ.. ఇంటింటికి మరుగుదొడ్లు మంజూరు చేస్తున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఎంపిక చేసిన గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. మూడేళ్ల క్రితం ప్రతీ గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మలవిసర్జన రహిత(ఓడీఎఫ్)గ్రామాలుగా ప్రకటించింది. అనంతరం వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు నిలిచిపోయింది. గ్రామాల్లో కుటుంబాలతోపాటు గృహ నిర్మాణాల సంఖ్య పెరిగిపోయాయి. మరుగుదొడ్లు లేకపోవడంతో సమస్య మళ్లీ రావడంతో అధికారులు స్వచ్ఛభారత్ మిషన్‌లో తిరిగి గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టారు.
జిల్లాకు మొదటి విడతలో 100 మంజూరు
స్వచ్ఛభారత్ మిషన్ పథకంలో భాగంగా జిల్లాలోని 15 మండలాల్లోని గ్రామాలకు మొదటి విడతగా 100 మరుగుదొడ్లను మంజూరు చేశారు. ఆయా గ్రామాల్లో సగానికిపైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. మరుగుదొడ్డి నిర్మించినట్లయితే రెండు విడతలో లబ్ధిదారులకు రూ.12వేలు మంజూరు చేస్తారు. ప్రస్తుతం పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో రెండో విడత మరుగుదొడ్లు మంజూరు కాలేదు. కోడ్ ముగిసిన అనంతరం మరుగుదొడ్లు మంజూరవుతాయని స్వచ్ఛభారత్ మిషన్ అధికారులు పేర్కొంటున్నారు. మరుగుదొడ్లు లేనివాళ్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మంజూరు ఇలా
కొత్తగా ఇండ్లు నిర్మించుకున్న వాళ్లు వ్యక్తిగత మరుగుదొడ్డి కోసం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను గ్రామసభల్లో చదివిన అనంతరం అర్హులను ఎంపిక చేసి తీర్మాణం చేసి మండల పరిషత్తు కార్యాలయంలో అందిస్తారు. ఎంపీడీవో ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధకు చేరిన అనంతరం ఆన్‌లైన్ నమోదు చేస్తారు. పరిశీలన అనంతరం వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేస్తారు.
వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు
జిల్లాకు మొదటి విడతలో 100 యూనిట్లు
Comments
Please login to add a commentAdd a comment