
పదండి.. ఓటేద్దాం
● సరైన నాయకుడిని ఎన్నుకుందాం
● సిద్ధమంటున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులు
● నేటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం
సప్తగిరికాలనీ(కరీంనగర్): సమాజంలో మార్పు తీసుకొచ్చే సత్తా యువతకే ఉంటుంది. యువతను సన్మార్గంలో నడిపించే శక్తి ఉపాధ్యాయులకు ఉంటుంది. యువత, ఉపాధ్యాయులు కలిసి ఓటుహక్కు అనే బ్రహ్మాస్త్రాన్ని సక్రమంగా వినియోగించుకుంటే.. ఒక నికార్సయిన ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. పెద్దల సభలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యలపై గళమెత్తే గొంతును కూర్చోబెట్టే సమయం వచ్చింది. ఈ నెల 27న(నేడు) కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీకి 3.5లక్షలకు పైగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సుమారు 27వేల మందికి పైగా ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. ఓటరుగా నమోదు చేసుకోవడమే కాదు.. నేడు జరిగే ఓటింగ్‌లో పాల్గొని.. ప్రలోభాలకు లొంగకుండా మంచి అభ్యర్థులను ఎన్నుకునేందుకు సమాయత్తం కావాలి. ఈ క్రమంలో పదండి ఓటేద్దాం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటుదాం అంటున్నారు.. పలువురు పట్టభద్రులు.. ప్రయివేటు ఉపాధ్యాయులు.!!
Comments
Please login to add a commentAdd a comment