సీపీఆర్ చేసి భక్తుడి ప్రాణాలు కాపాడిన ఎస్సై
ఓదెల(పెద్దపల్లి): హఠాత్తుగా గుండెపోటుకు గురైన భక్తుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు ఎస్సై రమేశ్. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీమల్లికార్జునస్వామి సన్నిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన భక్తుడు ఒరుసు శ్రీనివాస్ మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఓదెల శ్రీమల్లికార్జునస్వామి దర్శనం కోసం తరలివచ్చాడు. స్వామివారి దర్శనం చేసుకుంటుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పొత్కపల్లి ఎస్సై దికొండ రమేశ్ వెంటనే సీపీఆర్ చేశారు. దీతో భక్తుడు స్పృహలోకి రావడంతో ఓ వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. పండుగపూట తమ కుమారుడు ఆపదకు గురైతే.. ఎస్సై దేవుడిలా ప్రాణాలు కాపాడారని శ్రీనివాస్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సైని పలువురు భక్తులు, స్థానికులు అభినందించారు.
సీపీఆర్ చేసి భక్తుడి ప్రాణాలు కాపాడిన ఎస్సై
Comments
Please login to add a commentAdd a comment