ప్రయాగ్‌రాజ్ వెళ్లివస్తూ.. అనంత లోకాలకు
వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త నల్లగోని వీరయ్యగౌడ్ ప్రయాగ్‌రాజ్ వెళ్లివస్తూ.. గుండెపోటుతో చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్ల గోని వీరయ్యగౌడ్ ఐదు రోజుల క్రితం తన కుటుంబసభ్యులతో కలిసి ప్రయాగ్‌రాజ్ కుంభమేళా పుణ్యస్నానాలకు వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న క్రమంలో వీరయ్య గౌడ్‌కు గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. వీరయ్య గౌడ్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్ బుధవారం పరామర్శించారు. పార్టీ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వీరయ్య గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు.
గుండెపోటుతో కాంగ్రెస్ కార్యకర్త మృతి
Comments
Please login to add a commentAdd a comment