
రాజన్న గుడిని అభివృద్ధి చేశామనడం హాస్యాస్పదం
● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాజ న్న గుడికి చేసిందేమి లేదని, పైపెచ్చు తమ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం హాస్యాస్పదమని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రాజన్నను బుధవారం దర్శించుకున్న కవిత మాట్లాడిన తీరుపై ఆయన ఇలా స్పందించారు. కేసీఆర్ తన లగ్గం ఇక్కడే అయ్యిందని ప్రగల్భాలు పలికి, రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్లు ఇస్తానని రాజన్న భక్తులను మోసం చేశారన్నారు. ఒక్క బడ్జెట్లో కూడా రూపాయి కేటాయించలేదన్నా రు. మేం ఎక్కడ కూడా బడ్జెట్‌లో నిధులు కేట యిస్తామని చెప్పకుండా బడ్జెట్లో రూ. 50కోట్లు కేటాయించామన్నారు. కవిత ఎవరో చెప్పిన స్క్రిప్ట్ చదివి వెళ్లారన్నారు. మహాశివరాత్రి వచ్చిందంటే రంగు రంగు బ్రోచర్లతో రాజన్న భక్తులను మోసం చేశారే తప్ప చేసిందేమీ లేదన్నారు. తిప్పాపూర్ మూడవ బ్రిడ్జి నిర్మాణనికి భూసేకరణ చేయలేదన్నారు. రాజన్న భక్తుడిగా తాము ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాన ని, ప్రజా ప్రభుత్వంలో రేవంత్‌రెడ్డి చొరవతో రాజన్న ఆలయ అభివృద్ధి రూ.75కోట్లు కేటా యించామన్నారు. రూ.47 కోట్లతో వేములవా డలో రోడ్లు విస్తరణ చేపడుతున్నామన్నారు.
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
● ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్లక్రైం: ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్‌మహాజన్ బుధవారం తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అధికా రులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా 200 మంది పోలీసులతో బందోబస్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 41 పోలింగ్ కేంద్రాల్లో 23,347 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఎవరైనా గొడవలు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాజన్న గుడిని అభివృద్ధి చేశామనడం హాస్యాస్పదం
Comments
Please login to add a commentAdd a comment