
ప్రలోభాలకు గురికావద్దు
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: ప్రలోభాలకు లొంగకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. పర్యవేక్షించిన కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 41 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 181 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు.
పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది
జిల్లాలో ఐదు రూట్లు, ఐదు జోన్లను ఏర్పాటు చేశారు. జంబో పోలింగ్ బాక్స్‌లను పోలింగ్‌కేంద్రాలకు తరలించారు. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, సిరిసిల్ల ఇన్‌చార్జి ఆర్డీవో రాధాభాయి ఆధ్వర్యంలో పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం జంబో పోలింగ్ బాక్స్‌లు, టీచర్ల ఎన్నిక కోసం రెగ్యులర్ పోలింగ్ బాక్స్‌లు వినియోగిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, అన్వేశ్, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment