ఎండలోనూ బారులుతీరారు
సిరిసిల్ల: ఎండలు మండుతుండడంతో పట్టభద్రులు ఎండలో నిల్చొని ఓట్లు వేసేందుకు ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ మందకొడిగా ప్రా రంభమైంది. మధ్యాహ్నం తరువాత ఓటర్ల రాక పెరగడంతో పోలింగ్ కేంద్రాల్లో నిరీక్షించాల్సి వచ్చింది. కోనరావుపేటలోని పోలింగ్ కేంద్రంలో ఎండలోనే ఓటర్లు నిరీక్షించారు. జిల్లా వ్యాప్తంగా చాలా కేంద్రాలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సాయంత్రం 4 గంటల వరకు కేంద్రానికి వచ్చిన వారికి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సొంత మండలం బోయినపల్లిలో ఓటుహక్కు వినియోగించుకోగా.. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేటలో, ముస్తాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి ఓట్లు వేశారు.
పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీలు
పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా, ఎస్పీ అఖిల్‌మహాజన్‌లు పరిశీలించారు. సిరిసిల్ల పట్టణం కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్, గీతానగర్ జెడ్పీ హైస్కూల్, కోనరావుపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఏజెంట్లు ఉండగా.. స్వతంత్ర అభ్యర్థులకు ఏజెంట్లు ఎవరూ లేరు.
ఎండలోనూ బారులుతీరారు
ఎండలోనూ బారులుతీరారు
ఎండలోనూ బారులుతీరారు
ఎండలోనూ బారులుతీరారు
Comments
Please login to add a commentAdd a comment