వైభవంగా శివకల్యాణం
కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం మామిడిపల్లి మహాదేవ ఆలయం, మల్కపేట శివాలయాల్లో గురువారం శివకల్యాణం కనులపండువగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉత్సవ విగ్రహాలను కల్యాణ వేదికపై ఆశీనులు చేసి అర్చకులు వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరిపారు. వేదపండితులు తిరునహరి కృష్ణస్వామి, కోచకంటి హరిశర్మ ఆధ్వర్యంలో కల్యాణ వేడుకలు కమనీయంగా కొనసాగాయి. ఈ వేడుకలకు డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ పన్నాల విజయ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment