
అత్యవసర పరిస్థితిలో రక్తదానం
సిరిసిల్లటౌన్: అత్యవసర పరిస్థితుల్లో వాత్సల్య ఫౌండేషన్ యువకులు రక్తదానం చేశారు. స్థానిక లీలశిరీష హాస్పిటల్‌లో వేములవాడ సమీపంలోని నూకలమర్రికి చెందిన గర్భిణీ సుంకపాక అనిత ‘బీ పాజిటివ్’ బ్లడ్ అవసరం ఏర్పడింది. అనిత కుటుంబ సభ్యులు వాత్సల్య ఫౌండేషన్‌ను సంప్రదించగా మాట్ల బాలరాజ్ జిల్లెల్ల నుంచి వచ్చి రక్తదానం చేశారు. వాత్సల్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆకా రపు సుధాకర్, లింగంపల్లి కిరణ్‌కుమార్, మధు, ప్రేమ్, బ్లడ్‌బ్యాంక్ ఇన్‌చార్జి రవీందర్ పాల్గొన్నారు.
ఘనంగా బద్దిపోచమ్మ బోనాలు
రుద్రంగి(వేములవాడ): మానాలలో శుక్రవారం బద్దిపోచమ్మ బోనాలు కనులపండువగా నిర్వహించారు. ఇంటికో బోనం చొప్పున మహిళలు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

అత్యవసర పరిస్థితిలో రక్తదానం
Comments
Please login to add a commentAdd a comment