నిబంధనలు పాటించని సెంటర్లపై చర్యలు
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత
సిరిసిల్ల: నిబంధనలు పాటించని స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత హెచ్చరించారు. జిల్లా పీసీపీఎన్‌డీటీ సలహా కమిటీ సమావేశాన్ని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో శుక్రవారం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ గర్భస్థ లింగనిర్ధారణ నేరమన్నారు. ప్రతీ స్కానింగ్ సెంటర్‌లో రేడియాలజిస్ట్ పేరు నమోదు చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్‌లు చేస్తే చట్టపర చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ లక్ష్మీనారాయణ, పీవోఎంఎస్‌ఎన్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, డీజీవో శోభారాణి, మా నేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు డాక్టర్ చింతోజ్ భాస్కర్, లీగల్ అడ్వయిజర్ శాంతి ప్రకాశ్ శుక్లా, ఝాన్సీలక్ష్మి, హెచ్‌ఈ బాలయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment