కాలుతున్నాయ్‌.. | - | Sakshi
Sakshi News home page

కాలుతున్నాయ్‌..

Published Sat, Mar 1 2025 7:46 AM | Last Updated on Sat, Mar 1 2025 7:45 AM

కాలుత

కాలుతున్నాయ్‌..

ఫైరింజిన్లు చేరేలోపే ఆస్తి బుగ్గి

జిల్లాలో రెండే ఫైర్‌స్టేషన్‌లు

మూడో స్టేషన్‌ కోసం డిమాండ్‌

మానవ తప్పిదాలతో ప్రమాదాలు

సహజంగా జరిగే అగ్ని ప్రమాదాలు చాలా తక్కువ. మానవ తప్పిదాలతో జరుగుతున్న ప్రమాదాలే అధికంగా ఉంటున్నాయి. ఇందులో సిగరెట్స్‌ తాగి అజాగ్రత్తగా పడేయడంతోనే అడవులు, ఇళ్లకు నిప్పు అంటుకున్న సందర్భాలు అనేకం. ఇలాంటి చిన్నపొరపాట్లు ధన, ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది.

– సీహెచ్‌ నరేందర్‌, ఎస్‌ఎఫ్‌వో, సిరిసిల్ల

జాగ్రత్తలు పాటించాలి

వేసవిలో తరచూ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో పూజ నుంచి వంటగదిలోని ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటి నిర్మాణ సమయంలో కాలనీల్లోకి అగ్నిమాపక వాహనాలు వచ్చేలా రోడ్లు ఉండేలా చూసుకోవాలి. సిగరెట్లు తాగి రోడ్డుపైన, గడ్డివాములు ఉన్న ప్రాంతంలో నిర్లక్ష్యంగా పారేయొద్దు. వీటి ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

– అనిల్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, వేములవాడ

సిరిసిల్లక్రైం: జిల్లాలో చిన్నపాటి అగ్నిప్రమాదాలకే ఆస్తులు బుగ్గిపాలవుతున్నాయి.ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 13 మండలాలు, రెండు మున్సిపాలిటీలకు కలిపి రెండు ఫైర్‌స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలోని శివారు మండలాల్లో అగ్నిప్రమాదాలు జరిగితే అగ్నిమాపక వాహనాలు అక్కడికి వెళ్లేలోపే ఆస్తులు కాలిపోతున్నాయి. ఈనేపథ్యంలో మూడో ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉంది.

90 ప్రమాదాలు..రూ.4కోట్ల నష్టం

ఏడాదికాలంలో సిరిసిల్ల స్టేషన్‌ పరిధిలో 51 అగ్ని ప్రమాదాల్లో రూ.3.50 కోట్ల ధన నష్టం జరిగింది. రూ.3 కోట్ల వరకు ఆస్తిని కాపాడారు. వేములవాడ పరిధిలో 39 ప్రమాదాల్లో రూ.27.26లక్షల ఆస్తి నష్టం జరిగింది. రూ.1.62 కోట్ల ఆస్తిని కాపాడారు.

మూడో స్టేషన్‌ కోసం డిమాండ్‌

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో రెండు ఫైర్‌స్టేషన్లు ఉన్నాయి. వేములవాడ నియోజకవర్గంలోని ఏ మండలంలో అగ్ని ప్రమాదం జరిగినా వేములవాడలోని ఫైర్‌స్టేషన్‌కు సమాచారం వస్తుంటుంది. ఇక్కడి నుంచి వాహనం చందుర్తి, రుద్రంగి మండలాల్లోని చివరి గ్రామాలకు చేరుకునేలోపు ఆస్తులు కాలి బూడిదవుతున్నాయి. ఇదే పరిస్థితి సిరిసిల్ల నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, గంభీ రావుపేట, వీర్నపల్లి మండలాల్లోనూ ఉంది. ఈక్రమంలోనే జిల్లాలో మూడో ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ జిల్లా ప్రజల నుంచి ఉంది. ఏళ్లుగా ఈ డిమాండ్‌ నెరవేరడం లేదు. ఇప్పటికైనా ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

అత్యవసర నంబర్లు

తక్షణ సహాయం : 101

సిరిసిల్ల ఫైర్‌స్టేషన్‌ : 87126 99259

వేములవాడ ఫైర్‌స్టేషన్‌ : 87126 99260

ఇది జిల్లా కేంద్రంలోని అంబికానగర్‌లో గత వారం జరిగిన అగ్నిప్రమాదం. ఇళ్ల మధ్యలో ఉన్న ముళ్లపొదల్లో ఒక్కసారిగా మంటలు లేచాయి. స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది. జిల్లా కేంద్రం కావడంతో నిమిషాల్లో ఫైర్‌ సిబ్బంది చేరుకోగలిగారు. అదే జిల్లా శివారు మండలాలు గంభీరావుపేట, వీర్నపల్లి, ఇల్లంతకుంట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకునేలోగానే ఆస్తులు కాలిపోతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
కాలుతున్నాయ్‌..1
1/2

కాలుతున్నాయ్‌..

కాలుతున్నాయ్‌..2
2/2

కాలుతున్నాయ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement