నాగరికతకు మూలం శాసీ్త్రయజ్ఞానమే
● జేవీవీ బాధ్యుడు రామరాజు
సిరిసిల్లకల్చరల్: మానవ నాగరికతకు మూ లం శాసీ్త్రయ జ్ఞానమేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం నేపథ్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్, వర్క్‌షాప్‌కు జనవిజ్ఞాన వేదిక బాధ్యుడు సి.రామరాజు, సంపత్‌కుమార్, పాఠశాల హెచ్‌ఎం చకినాల శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ శాసీ్త్రయ దృక్పథం పెంచుకోవడం ద్వారా నూతన ఆలోచన ధోరణితోపాటు ప్రశ్నించే స్వభావం అలవడుతుందన్నారు. అగస్త్య ఇంటర్నేషనల్ సహకారంతో రూపొందించిన సైన్స్ ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు తూముల తిరుపతి, రాజ గోపాల్‌రెడ్డి, బైరి రవీందర్, వడాల రవీందర్, రమాదేవి, శకుంతల, డేవిడ్‌సన్, రాజేశం, దేవేందర్, ఉపేందర్, అనిల్, రాజు పాల్గొన్నారు.
దేశనేతలను గౌరవించుకోవాలి
సిరిసిల్లటౌన్: దేశ నాయకులను పౌర సమాజం గౌరవించుకోవాలని మాలమహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు కోరారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ప్రెస్‌మీట్లో మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, భగత్‌సింగ్‌ల చిత్రపటాలను తీసివేయడాన్ని ఖండించారు. వెంటనే వారి చిత్రపటాలను ఏర్పాటు చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సంజీవయ్య యువజన సంఘం అధ్యక్షుడు కొంపల్లి విజయకుమార్, నాయకులు పండుగ రవి, శేఖర్, బాబు, బాలు పాల్గొన్నారు.
సమయపాలన పాటించాలి
● సీడీపీవో ఉమారాణి
ఇల్లంతకుంట(మానకొండూర్): అంగన్‌వాడీ టీచర్లు సమాచానికి విధులకు హాజరుకావాలని సీడీపీవో ఉమారాణి సూచించారు. ఇల్లంతకుంట, కందికట్కూర్ సెక్టార్ల్ల పరిధిలోని అంగన్‌వాడీ టీచర్ల సమావేశాన్ని శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్లు చేయాల్సిన పనులు సకాలంలో ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలన్నారు. మహిళా సాధికారిత జెండర్ స్పెషలిస్ట్ దేవిక మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్లకు, విద్యార్థులకు గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌ల గురించి వివరించారు. బీసీ రాజు, సూపర్‌వైజర్లు సూర్యకళ, చంద్రకళ, అంగన్వాడీలు అరుణ, విజయలక్ష్మి, బాబాయ్ తదితరులు పాల్గొన్నారు.
నాగరికతకు మూలం శాసీ్త్రయజ్ఞానమే
నాగరికతకు మూలం శాసీ్త్రయజ్ఞానమే
Comments
Please login to add a commentAdd a comment