అన్నదాతలకు అండగా ఉంటాం
● రైతుల పక్షాన పోరాడుతాం ● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ● ఎండిన పొలాలు, కాలువల పరిశీలన
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మల్కపేట కాల్వ పరివాహక రైతులు కాల్వ నీళ్ల కోసం చేసే పోరాటానికి మద్దతుగా ఉంటామని, రైతుల పక్షాన ఎలాంటి ఉద్యమాలకై నా సిద్ధమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. ఆగయ్య ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండా, రాజన్నపేటలో ఎండిన పంట పొలాలు, కాల్వలను శుక్రవారం పరిశీలించారు. ఆగయ్య మాట్లాడుతూ గత 15 రోజులుగా భూగర్భ జలాలు అడుగంటి బోర్ బావుల్లో నీరు లేక అరిగోస పడుతున్నారన్నారు. ఎండుతున్న పొలాన్ని చూడలేక పశువులకు మేతగా వదులుతున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మిడ్‌మానేరు నీటిని మల్కపేటకు పంపింగ్ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు అందె సుభాష్, కొండ రమేశ్‌గౌడ్, నమిలికొండ శ్రీనివాస్, గుగులోతు పెంటయ్య, అజ్మీరా రాజునాయక్, అజ్మీరా తిరుపతినాయక్, భూక్య ప్రభునాయక్, ధరావత్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment