ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి
● లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్‌రావు ● అపెరల్‌పార్క్‌లో ఆర్థిక అవగాహన సదస్సు
సిరిసిల్ల: ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్‌రావు పేర్కొన్నారు. లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల శివారులోని అపెరల్ పార్క్ గార్మెంట్ యూనిట్‌లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా వచ్చే వేతనాలను సరైన విధంగా ఖర్చు చేయాలన్నారు. అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లవద్దని సూచించారు. ఖర్చులు పోను మిగిలే డబ్బులను ప్రభుత్వ సెక్యూరిటీల్లో డిపాజిట్ చేయాలని తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకునే రుణాల ఈఎంఐలు క్రమం తప్పకుండా చెల్లించాలన్నారు. సోషల్, ఇతర మీడియాల్లో వచ్చే ఆర్థిక ప్రకటనలు నమ్మి పెట్టుబడి పెట్టవద్దని కోరారు. లీడ్ బ్యాంక్ కౌన్సిలర్ వెంకటరమణ, గ్రీన్ నీడిల్ సీనియర్ హెచ్‌ఆర్ మేనేజర్ ఫణికుమార్, హెచ్‌ఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment