ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి శుక్రవారం సమీక్షించారు. ఈనెల 5 నుంచి నిర్వహించే ఇంటర్ పరీక్షల సిబ్బంది శిక్షణ పూర్తయిందని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ఆర్టీసీ బస్సులు నడపాలని ఆదేశించారు. ఫస్టియర్‌లో 5,065, సెకండియర్‌లో 4,245 మంది విద్యార్తుల కోసం 16 సెంటర్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఎల్‌ఆర్‌ఎల్ 25 శాతం రాయితీ
జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌కు 42,942 దరఖాస్తులు వచ్చాయని, అందులో 27,170 ప్రాసెస్ కాగా, 15,772 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. గడువులోగా ఎల్‌ఆర్‌ఎస్ చేసుకుంటే.. 25 శాతం రుసుంలో రాయితీ వర్తిస్తుందని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీనివాస్, ఆర్డీవోలు రాజేశ్వర్, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment