సిరిసిల్లటౌన్: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు రాజకీయాలు పక్కనబెట్టి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. స్థానిక పార్టీ ఆఫీసులో శనివారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పేదలకు కొత్త రేషన్‌కార్డులను ఇచ్చిన పాపాన పోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తోందన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment