
ముస్తాబాద్‌కు సాగునీటిని అందించాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండల కేంద్రంలోని పొలాలకు ఈ యాసంగికి సాగునీటిని అందించాలని తహసీల్దార్ సురేశ్‌కు రైతులు శనివారం విన్నవించారు. ఎగువ మానేరు నీటిని కెనాల్ డిస్ట్రిబ్యూటరీ–18 వరకు మాత్రమే అందిస్తున్నారని, దీంతో 19, 20 డిస్ట్రిబ్యూటరీల కింద ఉన్న వెయ్యి ఎకరాలకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెర్లుమద్ది, సేవాలాల్‌తండాకు మానేరు కెనాల్ ద్వారా వారానికి రెండుసార్లు విడుదల చేస్తున్న అధికారులు.. ముస్తాబాద్‌ను ఎందుకు విస్మరిస్తున్నారో చెప్పాలని కోరారు. రైతులు బాలెల్లు, శీలం స్వామి, శ్రీనివాస్, బాలయ్య, పర్శరాములు, ఎల్లం, రాములు పాల్గొన్నారు.
సింగసముద్రానికి నీరందించాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్లటౌన్: ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పంటలు ఎండకముందే సింగసముద్రానికి మల్కపేట రిజర్వాయర్ నుంచి నీరందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని ఆయకట్టు భూములకు సాగునీరు ఇబ్బందులు రానీయద్దంటూ శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపెల్లి, బుగ్గరాజేశ్వరతండా, అల్మాస్‌పూర్, కిష్టనాయక్‌తండా, రాజన్నపేట, బాకుర్‌పల్లితండాల్లో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. మిడ్‌మానేరు నుంచి మల్కపేటకు నీటిని పంపింగ్ చేసి సింగసముద్రానికి నీరు వచ్చేలా చూడాలని కోరారు. ఇల్లంతకుంట మండలం రైతుల కోసం రంగనాయకసాగర్ నుంచి బోడుమీదపల్లి, నర్సింహులపల్లి వరకు వదరకాల్వ పనులు పూర్తిచేయాలని కోరారు. ఆడెపు రవీందర్, నాగుల శ్రీనివాస్, మ్యాన రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ స్కాలర్‌షిప్స్ విడుదల చేయండి
● ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కల్యాణ్‌కుమార్
గంభీరావుపేట(సిరిసిల్ల): పెండింగ్ స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శనివారం గంభీరావుపేటలో నిరసన తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కల్యాణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నారని, విద్యకు మాత్రం మంత్రి లేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరుణ్, ఈశ్వర్, మనిస్వాంత్, అజయ్, నిఖిల్ పాల్గొన్నారు.
బాలికలను రక్షిద్దాం.. చదివిద్దాం
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురం అంగన్‌వాడీ సెక్టార్ సమావేశంలో జిల్లా మహిళా సాధికారిత కేంద్రం బేటి బచావో బేటి పడావో కార్యక్రమం శనివారం నిర్వహించారు. జెండర్ స్పెషలిస్ట్ దేవిక మాట్లాడుతూ బాలికలను వివక్ష, దాడుల నుంచి రక్షించుకోవాలని కోరారు. సీడీపీవో ఉమారాణి, సూపర్‌వైజర్ సూర్యకళ పాల్గొన్నారు.

ముస్తాబాద్‌కు సాగునీటిని అందించాలి

ముస్తాబాద్‌కు సాగునీటిని అందించాలి

ముస్తాబాద్‌కు సాగునీటిని అందించాలి
Comments
Please login to add a commentAdd a comment