
చివరికి బీటలు
● పొట్టకొచ్చిన పొలం నీళ్లకేడ్చింది ● 35వేల ఎకరాల్లో ఎండిన పొలాలు ● జిల్లాలో అడుగంటిన ఊటలు ● ఎల్లారెడ్డిపేటలో 15.62మీటర్లకు పడిపోయిన నీటిమట్టం ● నేడు పొలాలను పరిశీలించనున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
వ్యవసాయ స్వరూపం
వ్యవసాయ కనెక్షన్లు : 74,754
వరి సాగు : 1,77,042.28 ఎకరాలు
బోర్లు : 41,104 (చాలా బోర్లు ఎండిపోయాయి)
బావులు : 28,124 (ఎక్కువ బావులు
వట్టిపోయాయి)
రైతులు : 84,109
ఇది ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ శివారులోని వరి పొలం. బోరు ఎత్తిపోవడంతో నీరు అందక మొత్తం ఎండిపోయింది. దీంతో ఆ పొలంలో స్థానిక గొర్రెలకాపరులు ఇలా జీవాలను మేపుతున్నారు. పొలం పశువులకు మేతగా మారడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 20 శాతం మేరకు వరి పొలాలు ఎండిపోయాయి. దాదాపు 35వేల ఎకరాల్లో పంట పూర్తిగా చేతికందకుండా పోయింది. మరో పక్షం రోజుల్లో మరిన్ని పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చివరికి బీటలు
Comments
Please login to add a commentAdd a comment