శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
సిరిసిల్ల: జిల్లా రైతులు పండించిన శనగల పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనగల కొనుగోలుపై సమీక్షించారు. జిల్లాలో 175 ఎకరాల్లో శనగపంట సాగైందని, 1,347 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని కలెక్టర్ వివరించారు. బోయినపల్లి, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లోని సింగిల్‌విండోలు, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా శనగలు కొనుగోలు చేయాలని కోరారు. క్వింటాలు శనగలకు రూ.5,650 మద్దతు ధర చెల్లించాలని సూచించారు. తేమకొలిచే యంత్రాలు, టార్ఫాలిన్ కవర్లు, వెయింగ్ మిషన్లు, గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలన్నారు. శనగల నిల్వకు గోదాములు గుర్తించాలన్నారు. జిల్లా మార్క్‌ఫెడ్ అధికారి హబీబ్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, జిల్లా వ్యవసాయాధికారి అబ్జల్ బేగం, డీసీవో రామకృష్ణ, డీఎస్‌వో వసంతలక్ష్మి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రజిత పాల్గొన్నారు.
సోలార్ ప్లాంట్లకు స్థలాలు గుర్తించండి
ప్రధానమంత్రి కుసుం పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని పంచాయతీరాజ్ కార్యదర్శి దివ్య దేవరాజన్ కోరారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మహిళా సంఘాల ద్వారా నడిపేలా చిన్న చిన్న సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. డీఆర్‌డీవో శేషాద్రి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ఆస్పత్రి పర్యవేక్షకులు లక్ష్మీరాజం, పి.పెంచలయ్య పాల్గొన్నారు.
క్వింటాలు మద్దతు ధర రూ.5,650
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Comments
Please login to add a commentAdd a comment