నేడు సిరిసిల్లకు కేటీఆర్
సిరిసిల్ల: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు ఆదివారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. కేటీఆర్ పర్యటన వివరాలు వ్యక్తిగత సహాయకుడు మహేందర్‌రెడ్డి శనివారం వెల్లడించారు. ఇటీవల జైలుకు వెళ్లివచ్చిన తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డిని, సిరిసిల్లలో టీస్టాల్‌ను కోల్పోయిన బత్తుల శ్రీనివాస్‌ను పరామర్శిస్తారు. మరణించిన బీఆర్‌ఎస్ నాయకులు కాసర్ల మల్లేశం, బుర్ర శంకరయ్య కుటుంబాలను పరామర్శిస్తారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించనున్నారు. రైతులతో మాట్లాడుతారు. ముస్తాబాద్ మండలం పోత్గల్‌లో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు జెల్ల దేవయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
నీటి మళ్లింపును అడ్డుకున్న అధికారులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లబొప్పాపూర్–రాచర్లగొల్లపల్లి శివారులోని జక్కుల చెరువు నుంచి ఓ రైతు అక్రమంగా నీటి మళ్లించగా రైతుల ఫిర్యాదుతో శనివారం అధికారులు అడ్డుకున్నారు. రాచర్లబొప్పాపూర్‌కు చెందిన రైతు వరుస బాలయ్య జక్కుల చెరువు కాల్వలకు రెండు మోటార్లు పెట్టి తన బావిలోకి నీటిని మళ్లించాడు. గమనించిన ఆయకట్టు రైతులు బాలయ్యను నిలదీయగా దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని నీటి సంఘం చైర్మన్ గోగూరి శ్రీనివాస్‌రెడ్డి, మర్రి శ్రీనివాస్‌రెడ్డి, దాసరి గణేష్ ఏఈ భాస్కర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఏఈ క్షేత్రస్థాయిలో పరిశీలించి జక్కుల చెరువు కాలువల నుంచి నీటి మళ్లింపును నిలిపివేశారు.
నేడు సిరిసిల్లకు కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment