
సమస్యలు పరిష్కరిస్తాం
సుర్రుమన్న ‘సన్’డే
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో ఆదివారం భానుడు భగ్గుమన్నాడు. శ్రీరామనవమి సందర్భంగా ఉదయం పూటనే వీధులు పండుగ శోభతో కళకళలాడాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్యుడు సుర్రుమన్నాడు. ఎండలు మండిపోవడంతో జనం రోడ్లపైకి వచ్చేందుకు భయపడ్డారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన వీధులు బోసిపోయాయి.
● మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
ఇల్లంతకుంట(మానకొండూర్): రామాజీపేట రామాలయం వద్ద ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. రామాలయంలో ఆదివారం నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి హాజరయ్యారు. విద్యుత్ దీపాలు, తాగునీటి బోర్, ట్యాంకు, మాలధారులకు హాల్ కావాలని భక్తులు కోరగా.. త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే, కలెక్టర్ హామీ ఇచ్చారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ఇల్లంతకుంట ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్ పాశం రాజేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు పసుల వెంకటి, ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, కరివేద కరుణాకర్‌రెడ్డి, చిట్టి ఆనందరెడ్డి, కె.భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరిస్తాం

సమస్యలు పరిష్కరిస్తాం