
పూజలు.. దర్శనాలు
● ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కేటీఆర్
సిరిసిల్ల/కోనరావుపేట/గంభీరావుపేట: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు బుధవారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో హనుమాన్‌మాలధారులతో కలిసి భజనలు చేసి, సహపంక్తి బిక్షలో పాల్గొన్నారు. హనుమాన్‌మాలధారులు కేటీఆర్‌కు సీతారాముల చిత్రపటాన్ని అందించారు. జిల్లా పర్యటనలో కేటీఆర్ ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడలేదు. కోనరావుపేట మండలం మల్కపేట సీతారామచంద్రస్వామి ఆలయం, గంభీరావుపేట మండలకేంద్రంలోని పెద్దమ్మ ఆలయ 50వ వార్షికోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ అరుణ, వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, మల్యాల దేవయ్య, చంద్రయ్య, బండ నర్సయ్య, సెస్ వైస్‌చైర్మన్ తిరుపతి పాల్గొన్నారు.