
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
చందుర్తి(వేములవాడ): స్వశక్తి సంఘాల మహిళల ఆర్థికాభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి మండలం కిష్టంపేట, చందుర్తి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. కిష్టంపేటలో నిర్వహించిన లక్ష్మీనరసింహస్వామి కల్యాణంలో పాల్గొన్నారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతోనే కొనుగోలు కేంద్రాల బాధ్యతను స్వశక్తి సంఘాలకు ప్రభుత్వం అప్పగించిందన్నారు. ఈ ప్రాంతంలో కాలువలు, రిజర్వాయర్ పనులు చేయించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చలువతోనే సాగునీటి తిప్పలు తప్పాయన్నారు. చందుర్తి 176 సర్వేనంబర్‌లోని ప్రభుత్వ భూమిని కొనుగోలు కేంద్రానికి కావా ల్సిన అనుమతులు ఇప్పిస్తామని తెలిపారు. చందుర్తి మండల సమాఖ్యకు బస్సు మంజూరైందని, మహిళా సంఘాల సభ్యులు ముందుకొస్తే రైస్‌మిల్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, ఐకేపీ ఏపీఎం రజిత, నాయకులు ముస్కు ముకుందరెడ్డి, బానాల లక్ష్మారెడ్డి, పోతుగంటి రఘుపతి, మోకనపల్లి దేవరాజు, బానాల గంగారెడ్డి, గొట్టె ప్రభా కర్, పులి సత్తయ్య, దారం చంద్రం పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం