హస్తినాపురం: ఎల్‌బీనగర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పేర్కొన్నారు. హస్తినాపురం డివిజన్ సప్తగిరిహిల్స్ కాలనీలో రూ.65 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులను బుధవారం ఆయన స్థానిక కార్పొరేటర్ బానోతు సుజాతానాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా అధికారంలో ఉన్నవాళ్లు నియోజకవర్గం అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో నిధులు మంజూరుచేసి అభివృద్ధి చేస్తుంటే రాజకీయాలు చేస్తూ అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాల కబ్జాలు, ఆక్రమణలతోనే ఇన్నాళ్లు పాలన సాగించిన కొందరు నాయకులు అభివృద్ధి పనుల విషయంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. గతంలో సప్తగిరిహిల్స్ కాలనీవాసులకు రోడ్లు, డ్రైనేజీ కోసం అడిగితే నిధులను మంజూరు చేయకుండా ప్రజాప్రతినిధులం అని చెప్పుకునే నాయకులు ఇబ్బందులు పెట్టారని కానీ తమ ప్రభుత్వం కాలనీల్లోని సమస్యలు తీర్చేందుకు నిధులు మంజూరు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వరరెడ్డి, పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్‌యాదవ్, నాయకులు శశిధర్‌రెడ్డి, నర్సింహ్మయాదవ్, గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వేణుగోపాల్‌యాదవ్, డేరింగుల కృష్ణ, దాము మహేందర్‌యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment