ఉద్యోగులకు బదిలీలు సహజం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు బదిలీలు సహజం

Published Thu, Feb 20 2025 8:21 AM | Last Updated on Thu, Feb 20 2025 8:16 AM

ఉద్యోగులకు బదిలీలు సహజం

ఉద్యోగులకు బదిలీలు సహజం

కడ్తాల్‌: ఉద్యోగులకు బదిలీలు సహజమని బీఆర్‌ఎస్‌ నాయకుడు చేగూరి మహేశ్‌ అన్నారు. మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రంలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న రాధిక విజయ డెయిరీ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం మైసిగండిలో ఆమెకు వీడ్కోలు సన్మాన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ.. మేనేజర్‌గా ఆమె రైతులకు అందించిన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతయని అన్నారు. నాలుగు సంవత్సరాలుగా ఉత్తమ పనితీరు కనబర్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. అనంతరం మేనేజర్‌ రాధిక దంపతులకు మెమెంటో అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాలశీతలీకరణ సిబ్బంది, పాడి రైతులు రంగయ్య, మోహన్‌రెడ్డి, నర్సింహ, శ్రీనివాస్‌, రామకృష్ణ, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement