ఆరె కటిక సంఘం అధ్యక్షుడిగా సుభాశ్
ఆమనగల్లు: సూర్యవంశ ఆరెకటిక సంఘం మండల అధ్యక్షుడిగా కమ్లేకర్ సుభాశ్‌ను ఎన్నుకున్నారు. బుధవారం పట్టణంలో సంఘం సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీ నియామకం చేపట్టారు. ఉపాధ్యక్షుడిగా యాదీలాల్‌ను ఎన్నుకున్నారు. అనంతరం సుభాశ్, యాదీలాల్‌ను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రమేశ్, అమర్‌సేన్, నిరంజన్, శ్రీను, శంకర్, సుమన్, బబ్లూ, కుమార్, శ్రీను, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు ఏడీఏగా శోభారాణి
ఆమనగల్లు: ఆమనగల్లు డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులుగా కె.శోభారాణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఆదిలక్ష్మి జిల్లాలోని రాంజేంద్రనగర్ రైతు శిక్షణ కేంద్రానికి బదిలీ అయ్యారు. కాగా హైదరాబాద్‌లోని హాకా సంస్థలో పనిచేస్తున్న శోభారాణి బదిలీపై ఏడీఏగా ఆమనగల్లుకు వచ్చారు. ఈ సందర్భంగా నూతన ఏడీఏను మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
ఆర్థిక సాయం అందజేత
అబ్దుల్లాపూర్‌మెట్: బాటసింగారం రైతు సేవా సహకార సంఘం సభ్యుడు, అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన ఏర్పుల చిన్న రాజయ్య ఫిబ్రవరి 12న మృతిచెందగా, సహకార సంఘం తరపున మృతుడి కుటుంబానికి అందించే రూ.25వేల ఆర్థిక సాయాన్ని మంగళవారం సంఘం కార్యాలయంలో చైర్మన్ చేగూరి భరత్‌కుమార్ మృతుడి భార్య ఏర్పుల యాదమ్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగమయ్య, మేనేజర్ ఐలేష్‌యాదవ్, మాజీ వైస్ చైర్మన్ సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.
విద్యార్థులు క్రీడల్లోనూ
రాణించాలి
తుర్కయంజాల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని వేణుగోపాల స్వామి ఆలయం చైర్మన్ కె.రాఘవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన కొహెడ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు రూ.30వేలు వెచ్చించి క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాఘేవందర్‌రెడ్డిని పాఠాశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం తిరుపతిబాయ్, ఉపాధ్యాయులు రాజు, లక్ష్మణ్, గోపాల్‌రెడ్డి, కొండయ్య, ఉమామహేశ్వరి, రాధా మాధవి, గణేశ్, అమర్‌సింగ్, చంద్రమోహన్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన వార్షిక
అడ్వైజరీ కౌన్సిల్
అబ్దుల్లాపూర్‌మెట్: మండల పరిధిలోని గుంతపల్లిలోని అవంతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో మంగళవారం అవంతి గ్రూప్స్ వార్షిక అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అవంతి విద్యాసంస్థల చైర్మన్ ముత్తెంశెట్టి శ్రీనివాస్‌రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత, అవంతి గ్రూప్స్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ టీహెచ్ హనుమాన్ చౌదరి, జేఎన్‌టీయూ హైదరాబాద్ మాజీ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ వాహిద్, వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆరె కటిక సంఘం అధ్యక్షుడిగా సుభాశ్
ఆరె కటిక సంఘం అధ్యక్షుడిగా సుభాశ్
ఆరె కటిక సంఘం అధ్యక్షుడిగా సుభాశ్
ఆరె కటిక సంఘం అధ్యక్షుడిగా సుభాశ్
Comments
Please login to add a commentAdd a comment