బీఆర్‌ఎస్‌వి దొంగ దీక్షలు
● ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు గులాబీ నేతలకు లేదు ● యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యామ రాజేశ్
కడ్తాల్: రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని.. ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక హక్కు బీఆర్‌ఎస్ నేతలకు లేదని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యామ రాజేశ్ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతు సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుంటే రైతుదీక్షల పేరిట బీఆర్‌ఎస్ నేతలు దొంగ దీక్షలు చేపడుతున్నారని విమర్శించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతులను కలవడానికి ఇష్టపడని నాయకులకు అధికారం పోగానే ప్రజలు గుర్తుకు వస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను, మాటలను ప్రజలు చీత్కరించుకుంటున్నారన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని మోసపూరిత వాగ్ధానాలు ఇచ్చి రెండు సార్లు అధికారం చేపట్టినా రూ.లక్ష కూడా మాఫీ చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2లక్షల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నానరు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా పేరిట ఎకరాకు రూ.12వేలు రైతుల ఖాతాలోనే జమ చేస్తుందన్నారు. వరి ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తుందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఇప్పటికై నా బీఆర్‌ఎస్ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శాబుద్దీన్, రవి, భానుకిరన్, నరేశ్, శ్రీకాంత్, సాయి, రమేశ్, మహేశ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment