ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనంద్‌రెడ్డి
బడంగ్‌పేట్: పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్‌హాలును ఎలాంటి నాలాను ఆక్రమించి నిర్మించలేదని, కబ్జాలు చేసి నిర్మించారన్న విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీటీసీ మాజీ సభ్యుడు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పెద్దబావి ఆనంద్‌రెడ్డి అన్నారు. బుధవారం బడంగ్‌పేటలోని గార్డెన్‌లో నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2007లో జీపీ అనుమతితో మల్లారెడ్డి పేరుతో ఫంక్షన్‌హాల్ నిర్మించి 2009లో ప్రారంభించామన్నారు. గాంధీనగర్ దగ్గర ఉన్న తుర్కదానికుంట నుంచి వరదనీరు, వాననీరు పొలాల గుండా పారుతూ బడంగ్‌పేట్ ప్రధాన రహదారిలో నిర్మించిన కల్వర్టు కింద మత్తడి దాటుతూ కాశీబుగ్గ ఆలయం మీదుగా శివనారాయణపురం కాలనీ దాటుతూ పెద్ద చెరువుకు చేరుకునేది. ఈ కాలువ చాలా సంవత్సవాలు కొనసాగింది. రెండేళ్ల క్రితం వరద కాలువను మట్టితో నింపేయడం కారణంగా ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. ఆ వరద కాలువను బీజేపీ నాయకులు మట్టిపోసి మూసివేశారని ఆరోపించారు. శివసాయినగర్ కాలనీకి చెందిన సెప్టిక్‌ట్యాంక్‌ను కూడా బీజేపీ నాయకులు మట్టితో మూసివేయడంతో కాలనీవాసులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. 20 ఏళ్ల క్రితం సైకిల్‌పై పాలు అమ్మిన అందెల శ్రీరాములు కల్వర్టు మీద నుంచి రోజు వచ్చేవాడన్న సంగతి మరిచిపోయాడా అని నిలదీశారు. బీజేపీ నాయకులే మట్టిని పోసి, తిరిగి వారే ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. అందెల శ్రీరాములు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే సబితారెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment