సంఘం అభివృద్ధి అభినందనీయం
హిమాచల్‌ప్రదేశ్ బృందం కితాబు
తుర్కయంజాల్: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అపెక్స్ బ్యాంకు అధ్యక్షులు, డైరక్టర్లు, సీనియర్ సిబ్బంది బృందం బుధవారం తుర్కయంజాల్‌లోని రైతు సేవా సహకార సంఘాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్యతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సంఘం అభివృద్ధికి చేపట్టిన చర్యలు, పని విధానాన్ని, రైతుల కోసం చేపడుతున్న చర్యలపై వివరించారు. బీఎన్‌రెడ్డి నగర్, కొహెడలోని బ్రాంచి కార్యాలయాలు, గోదాంలను పరిశీలించారు. సంఘం అభివృద్ధిని చూసి సత్తయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ సీటీఐ గౌతమ్, డీసీసీబీ ఏజీఎం శైలజ, హిమాచల్ ప్రదేశ్ డెలిగేట్స్ జీబీ శర్మ, శక్తి చంద్ ఠాకూర్, ప్రేమ్ కంషల్, సంఘం సెక్రటరీ వై.రాందాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment