లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించండి
ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు భాస్కర్
మంచాల: గతంలో గుర్తించిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు కంభాలపల్లి భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన లింగంపల్లి, నోముల, మంచాల గ్రామాలకు చెందిన లబ్ధిదాలతో కలిసి మంచాల మండల కార్యాలయంలో సూపరింటెండెంట్ మహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. లింగంపల్లి గేట్ వద్ద గత ప్రభుత్వం 96 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించిందని.. గ్రామ సభలు పెట్టి లాటరీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసిందని గుర్తు చేశారు. 16 నెలలు అవుతుతున్నా.. ప్రభుత్వం మారినా లబ్ధిదారులకు మాత్రం ఇళ్లు అప్పగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇళ్ల పంపిణీ చేపట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment