కాంగ్రెస్ నుంచి ‘కారు’ గూటికి
కడ్తాల్: మండల పరిధిలోని గోవిందాయిపల్లి తండాకు చెందిన పలువురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్‌నాయక్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో దశరథ్‌నాయక్ వారికి కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి పాలన నచ్చకనే పార్టీ మారుతున్నామని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో గణేశ్, జైపాల్, గోపాల్, మునీందర్, దశరథ్, నరి, మల్లేశ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు లచ్చిరామ్‌నాయక్, ప్రియా రమేశ్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ, నాయకులు సంతోశ్‌కుమార్, గోపాల్, అంజి, హంజద్, శివరాం, దాస్య, గోపాల్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment