నేల‘పాలు’
పోదాం పోలేపల్లి వికారాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి.
8లోu
యాచారం: మండల పరిధి కుర్మిద్ద గ్రామంలో 90 మంది రైతులు 25 ఏళ్లుగా మదర్ డెయిరీకి పాలు పోస్తున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం రెండు పూటలా 1,700 లీటర్ల పాలను సంస్థకు విక్రయిస్తున్నారు. నాణ్యతను బట్టి గేదె పాలు లీటరు రూ.46, ఆవు పాలు లీటరుకు రూ.31 వరకు సంస్థ చెల్లిస్తుంది. ఇదిలా ఉండగా.. ఆరు నెలలుగా రైతులకు డెయిరీ యాజ మాన్యం సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు.
రూ.45 లక్షలకు పైగా..
గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెల బిల్లులు రూ.45 లక్షలకు పైగానే అందాల్సిన ఉంది. వారం క్రితం బిల్లుల పెండింగ్‌పై రైతులు గ్రామంలోని మదర్ డెయిరీ సంస్థ కేంద్రం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ మహేందర్‌రెడ్డిని నిలదీశారు. ఇదే విషయాన్ని చైర్మన్ సంస్థ ఉన్నతాధికారులకు తెలిపారు. బిల్లులు అందజేయాలని కోరారు. అయినప్పటికీ.. సంస్థ నుంచి స్పందన లేకపోవడంతో బుధవారం డెయిరీ ఎదుట పాలు పారబోసి నిరసన వ్యక్తంచేశారు. పశువులను సాకడం కోసం రూ.వేలు ఖర్చు చేసి దాణా, పశుగ్రాసం కొనుగోలు చేసి, నెల మొత్తం కష్టపడితే బిల్లులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పశు పోషణతో పాటు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. రెండు, మూడు రోజుల్లో బిల్లులు మొత్తం చెల్లించాలని, లేని పక్షంలో నల్గొండ జిల్లాలో ఉన్న మదర్ డెయిరీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇబ్బంది పెడుతున్నారు
రెండు నెలలుగా సంస్థ రైతులకు బిల్లులు చెల్లించడం లేదు. మొ త్తం రూ.45 లక్షలకు పైగా రావలసి ఉంది. రైతులు పదేపదే అడుగుతున్నారు. ఇబ్బంది పెడుతున్నారు. 25 ఏళ్లుగా వారు పాలు పోస్తున్నారు. కానీ ఎప్పు డూ ఇలా జరగలేదు. ఆరు నెలలుగా బిల్లుల చెల్లింపులో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోంది.
– మహేందర్‌రెడ్డి, డెయిరీ చైర్మన్, కుర్మిద్ద
రూ.లక్షన్నర రావాలి
మదర్ డెయిరీకి నిత్యం 60 లీటర్ల పాలను విక్రయిస్తాను. నెలకు రూ.70 వేల బిల్లు అందాల్సి ఉంది. రెండు నెలల నుంచి బిల్లు రావటం లేదు. రూ.లక్షన్నరకు పైగా ఆగిపోయింది. నెలనెలా డబ్బులు రాకపోవడంతో పశుదాణా, గ్రాసం ఖర్చులు, కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది.
– గొట్టే అంజయ్య, రైతు కుర్మిద్ద
మదర్ డెయిరీ సంస్థ నిర్వాకం వలన పాడి రైతులు గోస పడుతున్నారు.నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో.. డబ్బుల కోసం అధికారులను ప్రాధేయ పడుతున్నారు. అయినాస్పందన కానరాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలను పారబోసి చేసి నిరసన తెలిపారు.
రెండు నెలలుగాఅందని పాల బిల్లులు
స్పందించని డెయిరీ యాజమాన్యం
ఆందోళన వ్యక్తంచేసిన రైతులు
దాణా కొనలేక పోతున్నామంటూ ఆవేదన
నేల‘పాలు’
నేల‘పాలు’
Comments
Please login to add a commentAdd a comment