ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత
ఎంపీ డీకే అరుణ
కొందుర్గు: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మహబూబ్‌నగర్‌ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారంమండల కేంద్రంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడుచుకోవాలని సూచించారు. యువత దురలవాట్లకు చేరువ కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, వారిలో భక్తి భావం పెంపొందించేలాకృషి చేయాలని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మీకాంత్ రెడ్డి, నాయకులు మహేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివారెడ్డి, మోహన్ సింగ్ పాల్గొన్నారు.
‘ఫ్యూచర్’ భద్రతకు
ఠాణా ఏర్పాటు
స్థలం పరిశీలించిన డీసీపీ సునీతారెడ్డి
యాచారం: ప్యూచర్ సిటీ భద్రతను దృష్టిలో పెట్టుకుని కొత్తగా పోలీస్‌స్టేషన్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. ఇందుకు మర్లకుంటతండా సమీపంలోని 330 అడుగుల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పక్కనే టీజీఐఐసీకి చెందిన మూడు ఎకరాల స్థలంలో ‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ’ పేరుతో ఠాణా ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. బుధవారం ఆమె.. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజుతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏ మార్గం గుండా వెళ్తోంది. ప్రస్తుతం నిర్మించే ఠాణా పక్కనుంచి పీఎస్ పరిధిలోని గ్రామాలకు రోడ్డు ఏ విధంగాఉంటుంది. కొత్త రహదారుల ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా అని తదితర విషయాలను టీజీఐఐసీ, పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ తేజంరెడ్డితదితరులు ఉన్నారు.
శనివారాల్లో ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు
లక్డీకాపూల్: ఆస్తి పన్ను సమస్యల పరిష్కారం కోసం ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ప్రజలకు ఆస్తిపన్ను సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పన్ను సమస్యలు, పునఃసమీక్ష అభ్యర్థనలు (ఆర్పీఎస్) ఆస్తిపన్ను అంచనాల్లో సవరణలు, బిల్ కలెక్టర్ల ద్వారా/ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపుల నమోదు, ఆన్‌లైన్ బకాయిలు సరిచేయడం, కోర్టు కేసుల పరిష్కారం, ఐజీఆర్‌ఎస్ సమస్యలు, స్వయం మూల్యాంకనం (సెల్ఫ్ అసెస్ మెంట్) తదితరాలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార కార్యక్రమం ఈ నెల 22న, మార్చి 1, 8, 15, 22,29 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు డిప్యూటీ కమిషనర్స్ కార్యాలయాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించిన ఏవైనా సమస్యలున్న వారు తమ సంబంధిత జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పైన పేర్కొన్న తేదీలలో నిర్వహించే ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం కార్యక్రమంలో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు.
శివాజీ జయంతి వేడుకల్లో ఎంపీ
ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత
Comments
Please login to add a commentAdd a comment