దేశానికే ఆదర్శం మన పల్లెలు
కడ్తాల్: పల్లెప్రగతితో తెలంగాణ పల్లెలు ఎంతో అభివృద్ధి చెందాయని, దేశానికే మన గ్రామాలు ఆదర్శంగా నిలిచాయని సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ జాతీయ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థలో బీహార్ ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్రంలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. గత పంచాయతీ పాలకవర్గంలో.. జీపీల అభివృద్ధి, సమస్యలు, సొంత ఆదాయ వనరుల పెంపు, పల్లెప్రగతి ద్వారా చేపట్టిన పనుల గురించి తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్లు, పల్లె ప్రకృతి వనం, ఇంకుడు గుంతలు, తడిపొడి చెత్త వేరుచేసే విధానం, రైతు వేదికలు, వైకుంఠధామాల నిర్మాణం తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు. సమష్టి నిర్ణయాలతో పల్లెలు అభివృద్ధిలో ముందున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా బీహార్ ప్రతినిధులు సంతృప్తి చెందారని, అభినందించి ప్రసంశించారని నర్మింహ్మారెడ్డి తెలిపారు. సమావేశంలో బీహార్ ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖేశ్‌సింగ్, స్మితా వర్మ, సంజయ్‌కుమార్, ఊర్మిలదేవి తదితరులు పాల్గొన్నారు.
సర్పంచుల సంఘం రాష్ట్రమాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి
జీపీల అభివృద్ధిపై బీహార్ ప్రజ్రాతినిధులు, అఽధికారులకు అవగాహన
Comments
Please login to add a commentAdd a comment