అబ్దుల్లాపూర్‌మెట్: ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం పైనుంచి కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్ భగత్‌సింగ్ నగర్ కాలనీకి చెందిన వేముల భిక్షపతి కుమారుడు గుణశేఖర్(27) శుక్రవారం సాయంత్రం సంఘీనగర్‌కు నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతను నడిపిస్తున్న బైక్ కిడ్ కావడంతో.. గుణశేఖర్ కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో గుణశేఖర్ దుర్మరణం చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment