
ఘనంగా సందల్ ఊరేగింపు
పహాడీషరీఫ్: పహాడీషరీఫ్ షర్ఫూద్దీన్ బాబా దర్గా 759వ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ తరఫున సందల్(గంధం) ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీలో భాగంగా ఇన్‌స్పెక్టర్ పి.గురువారెడ్డి, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ జితేందర్ రెడ్డిలు మహేశ్వరం ఏసీపీ పి.లక్ష్మీకాంత రెడ్డిలు తలపై పూలు, ఛాదర్ పెట్టుకొని ఊరేగింపుగా దర్గాపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా దర్గా ముతవల్లీలు ఫరీదుద్దీన్, ఇర్ఫాన్‌లు వారికి స్వాగతం పలికి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఊరేగింపులో పోలీసు సిబ్బంది ఉత్సాహంగా ముందుకు కదిలారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు శ్రీను, లక్ష్మణ్, దయాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment