కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
ఇబ్రహీంపట్నం రూరల్: ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. కనిపించకుండా పోయిన నాలుగు రోజులకు బాలిక ఆచూకీ లభ్యం కాగా.. పోలీసులు శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించిచారు. ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొంగ్లూర్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న ఏ.మంజు(16) ఈ నెల 16న కళాశాల నుంచి అదృశ్యమైంది. తల్లిదండ్రులకు పోన్ చేసినా.. అమ్మాయి వివరాలు తెలియరాకపోవడంతో కళాశాల యాజమాన్యం ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక కోసం గాలించగా.. ఆచూకీ లభ్యమైంది. అప్పటికే మిస్సింగ్ కేసుతో పాటు మరి కొన్ని కేసులు నమోదు చేసి, విచారణ జరిపినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని దొరకడంతో తల్లిదండ్రులు, పోలీసులు, కళాశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.
ఆస్తి పన్ను కట్టండహో!
బంజారాహిల్స్: ఆస్తి పన్ను బకాయిలున్న బడా బాబులకు, స్టార్ హోటళ్లకు సీజ్‌లతో షాక్ ఇస్తున్న అధికారులు తమ పంథా మార్చారు. ప్రస్తుతం బస్తీలు, కాలనీల్లో వినూత్న తరహాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31లోగా ఆస్తి పన్నుతో పాటు మొండి బకాయిలను వెంటనే చెల్లించాలంటూ క్షేత్ర స్థాయిలో అన్ని శాఖల సిబ్బంది చేతికి మైక్‌సెట్లు ఇచ్చి చాటింపు వేయిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్ బస్తీలో శుక్రవారం జీహెచ్‌ఎంసీ పారి శుద్ధ్య సిబ్బంది మైక్‌సెట్‌లో ఆస్తి పన్ను చెల్లించాలంటూ ప్రచారం చేశారు. ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారుల నివాసాలతో పాటు వాణిజ్య సముదాయాలకు నోటీసులు ఇవ్వడంతో పాటు స్పందించని వారి ఆస్తులను సైతం జప్తు చేసేందుకు వెనకాడబోమంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment