ధారూరు: రైతులు తమ పొలాల్లో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనేది తెలుసుకోవాలని తాండూరు వ్యవసాయ క్షేత్రం ఏరువాక కోఆర్డినేటర్, శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మండల పరిధిలోని కేరెళ్లిలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు శుక్రవారం క్షేత్ర పర్యటన చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ కృషి అనుభవ్, గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆర్థిక, సామాజిక పరిస్థితులను గ్రామాల్లో నిర్వహించే కార్యక్రమాలతో తెలుసుకోవచ్చన్నారు సాగుచేసిన పంటల్లో సస్యరక్షణ పద్దతులు, సాగులో అనుసరించాల్సిన మెళకువలు, సూచనలు, కాలానుగుణంగా తీసుకోవల్సిన పనులపై రైతులకు వివరించారు. వ్యవసాయ కళాశాల విద్యార్థులు వెన్‌డయాగ్రాం, ట్రాంసెక్ట్ వాక్, చపాతిపటం, సమస్య చెట్టు, సామాజిక పటం తదితర చిత్రపటాలను గీచి వాటి గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమలో శాస్త్రవేత్త యమునారెడ్డి, కళాశాల విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.
తాండూరు వ్యవసాయ క్షేత్రం ఏరువాక కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణ్
Comments
Please login to add a commentAdd a comment