
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
సీఐ రాఘవేందర్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి అన్నారు. ఇటీవల ఆదిబట్ల పోలిస్ స్టేషన్ పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న 29 సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. సంబంధిత వ్యక్తులకు శుక్రవారం అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పోలీసు శాఖ నిరంతరం ప్రజలు, వారి ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తుందని తెలిపారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకటేశ్, రాజు, హెడ్‌కానిస్టేబుల్ గిరి, కృష్ణ, సంతోష్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పీఎన్‌బీ ఎండీని కలిసిన మల్లురవి
ఆమనగల్లు: పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అశోక్‌చంద్రను నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో ఆయనను ఎంపీ కలిసి, నాగర్‌కర్నూల్ పార్లమెంటుపరిధిలోని అన్ని మండలాల యువతకు ఉపాధి కల్పించడానికి విరివిగా రుణాలుఅందించాలని కోరారు.
డిస్కస్ త్రో, షాట్ పుట్‌లో వెండి పతకాలు
శంకర్‌పల్లి: ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి డిస్కస్ త్రో, షాట్ పుట్ పోటీల్లో శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామానికి చెందిన వరుణ్ గౌడ్ ప్రతిభ చాటాడు. రెండు విభాగాల్లో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకాలు సాధించాడు. ప్రస్తుతం వరుణ్‌గౌడ్ బాసర ఐఐఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపడంతో మార్చి 20న పాట్నాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. తమ కుమారుడి ప్రతిభపై తల్లిదండ్రులు కల్పన, లక్ష్మణ్ హర్షం వ్యక్తంచేశారు.
స్పీకర్‌కు అవార్డు ప్రదానం
అనంతగిరి: ఇండియన్ బుక్‌ఆఫ్ రికార్డ్స్ సంస్థ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను మ్యాన్ ఆఫ్ అన్‌పారాలెల్డ్ మస్టరే అవార్డుతో సత్కరిచింది. గురువారం రాత్రి నగరంలోని రవీంద్రభారతిలో శృతిలయ సీలెవెల్ కార్పొరేషన్ –కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సినీనటి, దర్శకురాలు విజయనిర్మల జయంతి సందర్భంగా విజయకృష్ణా సిల్వర్ క్రౌన్–2025 అవార్డు,జంధ్యాల 75 వసంతాల వజ్రోత్సవ సంచిక ఆవిష్కరించారు.
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
లక్డీకాపూల్: వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ)వెంకటాచారి అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ సమన్వయ సమావేశంలో ఆయన మాట్టాడారు. హైదరాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలను 244 కేంద్రాలలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రశ్నపత్రాల తరలింపులో పోలీసులు అత్యంత బాధ్యత, భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు సమయానుకూలంగా పరీక్ష కేంద్రాలకు చేరేలా ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని.. క్యూఆర్ కోడ్ ద్వారా పరీక్ష కేంద్రాల లొకేషన్‌లను పరిశీలించుకోవాలన్నారు. సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్ 040 29700934ను సంప్రదించవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment