
అభివృద్ధి పనులపై ఆరా
కందుకూరు: న్యూఢిల్లీ నుంచి 7వ కామన్ రివ్యూ మిషన్ (సీఆర్‌ఎం) బృందం శనివారం మండల పరిధిలోని తిమ్మాపూర్, రాచులూరు, లేమూరు గ్రామాల్లో పర్యటించింది. బృందం సభ్యులైన ఒడిశా రాష్ట్ర మాజీ పీడబ్ల్యూడీ ఈఎన్‌సీ డాక్టర్ ఎన్‌సీ పాల్, కశ్మీర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జావిద్ ఇక్బాల్‌ఖాన్, ఛండీఘడ్ రాష్ట్రం సీఆర్‌ఆర్‌ఐడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వికాస్‌కుమార్, కోల్‌కతాకు చెందిన ఐఏఎం ప్రొఫెసర్ డాక్టర్ అవిజిత్‌దాస్ తదితరులు కేంద్ర, రాష్ట్ర నిధులతో ఆయా గ్రామాల్లో జరిగిన వివిధ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. మొదట తిమ్మాపూర్‌లో రైతుల పొలంలోని ఫారం పాండ్‌ను సందర్శించి అక్కడ పనులు చేస్తున్న ఉపాధి కూలీలతో నేరుగా మాట్లాడారు. అనంతరం రాచులూరు పరిధిలో సాగులో ఉన్న పండ్ల తోటలు, పశు పోషణను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రామంలో పింఛన్‌దారులతో మాట్లాడి, అక్కడి పోస్టాఫీస్‌ను సందర్శించి పింఛన్లు ఏవిధంగా పంపిణీ జరుగుతుందనే వివరాలను బీపీఎంను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు అందుతున్న పోషకాహారం వివరాలను పరిశీలించారు. గతంలో లబ్ధిపొందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్దకు వెళ్లి నేరుగా వారితో మాట్లాడారు. అనంతరం లేమూరు పంచాయతీలో పీఎంజీఎస్‌వై నిధులతో నిర్మించిన రోడ్డును పరిశీలించారు. వారి వెంట డీఆర్‌డీఓ శ్రీలత, డీపీఓ సురేష్‌మోహన్, హౌసింగ్ ఎస్‌ఈ భాస్కర్, హౌసింగ్ పీడీ చాంప్లా, పంచాయతీరాజ్ డీఈ అనిల్, ఎంపీడీఓ సరిత, ఏపీడీ నరేందర్‌రెడ్డి, చరణ్, ఎస్‌పీఎం మురళి, కృష్ణమూర్తి, ఎంపీఓ గీత, పంచాయతీరాజ్ ఏఈ సతీష్, కార్యదర్శులు శ్రీధర్, వెంకట్‌రెడ్డి, ఏపీఓ రవీందర్‌రెడ్డి, ఈసీ సుగుణ తదితరులు ఉన్నారు.
వంతెన నిర్మాణ పనుల పరిశీలన
ఆమనగల్లు: మండల పరిధిలోని మేడిగడ్డతండా సమీపంలో పీఎంజీఎస్‌వై పథకంలో భాగంగా రూ.3.10 కోట్లతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను శనివారం 7వ కామన్ రివ్యూ మిషన్ బృందం సభ్యులు పరిశీలించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల అమలు, పనితీరు పరిశీలించడానికి ఒడిశా మాజీ పీడబ్ల్యూడీ ఈఎన్‌సీ డా.ఎన్‌సీ పాల్, డా.జావిద్ ఇక్బాల్‌ఖాన్, డా.వికాస్‌కుమార్, డా.అబిజిత్‌దాస్ మేడిగడ్డతండా – శంకరకొండతండా రోడ్డు మధ్యలో కత్వ వాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మాడల్ హౌస్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆమనగల్లు ఎంపీడీఓ కుసుమమాధురి, ఎంపీఓ వినోద, పీఆర్‌డీఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఏఈ అభిలాష్, గ్రామ కార్యదర్శి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
పర్యవేక్షించిన సీఆర్‌ఎం బృందం
Comments
Please login to add a commentAdd a comment