
అంగరంగ వైభవం.. అమ్మవారి రథోత్సవం
తేరు లాగి పరవశించిన భక్తజనం ● కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం
ఆలయం ఎదుట భక్తజన సందోహం
బొంరాస్‌పేట: భక్తుల కొంగు బంగారం.. కోరిన వరాలిచ్చే కల్పవల్లి.. పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసా గుతున్నాయి. జాతరలో భాగంగా మూడో రోజు శనివారం సాయంత్రం 5.40 గంటలకు రథోత్సవం (తేరు లాగడం) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిమను రథంలో ఉంచి అమ్మా ఎల్లమ్మా.. కాపాడమ్మా.. కరుణించమ్మా అంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ ఏడాది రూ.14లక్షలతో తయారు చేయించిన రథాన్ని లాగుతున్న సమయంలో అమ్మవారి నామస్మరణతో పోలేపల్లి మార్మోగింది.
భక్తజన సందోహం
అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకునేందుకు లక్షలాదిగా తరలివచ్చారు. బుడగ జంగాలు, కురుమ, గొల్ల యాదవులు, బైండ్ల వారు ఆలయ ప్రాంతంలో జాగరణ చేస్తూ ఎల్లమ్మ తల్లి ఇతివృత్తాంతం ఆటపాటలతో తెలియజేశారు. ఆలయ చైర్మన్ జయరాములు, ఆలయ కమిటీ సభ్యులు వెంకటయ్యగౌడ్, లక్ష్మి, ఈఓ రాజేందర్‌రెడ్డి, నిర్వహకులు నర్సింహ, సింగర్ నర్సింహ తదితరులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అంగరంగ వైభవం.. అమ్మవారి రథోత్సవం

అంగరంగ వైభవం.. అమ్మవారి రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment