
బాలల హక్కులపై అవగాహన అవసరం
● కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి
కుల్కచర్ల: బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహనను పెంపొందించుకోవాలని కేజీబీవీ ప్రత్యేకా ధికారి దేవి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు మిషన్ వాత్సల్య కార్యక్రమంలో భాగంగా బాలల హక్కులపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ.. బాలలు తమ హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తిన సమయంలో ఉపాధ్యాయులు లేదా అధికారులకు తెలపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొంది.
Comments
Please login to add a commentAdd a comment