
జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి
బ్రహ్మోత్సవాలకు వేళాయె మహాశివరాత్రిని పురస్కరించుకుని చేపట్టే బ్రహ్మోత్సవాలకు త్రిపురాంతకేశ్వర, వీరభద్రస్వామి ఆలయం ముస్తాబవుతోంది.
8లోu
నందిగామ: జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే బాధ్యత అటు ప్రభుత్వాలు, ఇటు సమాజంలోని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతి వనంలో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 20న ప్రారంభమైన జాతీయ యూత్ బయోడైవర్సిటీ సదస్సు శనివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటగా జీవ వైవిద్య సదస్సు ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని అన్నారు. ప్రస్తుతం అంతరించిపోతున్న ప్రకృతి, సహజ సంపద, జీవరాసులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువత ప్రకృతిని కాపాడటంతో పాటు జీవ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వాలు సైతం అభివృద్ధి పేరిట ప్రకృతిని నాశనం చేయొద్దని, ప్రకృతిని, మానవ వనరులను కాపాడుకుంటూ అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. అడవులు, నీటి వనరులు, ప్రకృతి, పర్యావరణం దేవుడిచ్చిన వరాలని, వాటిని సంరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమని పేర్కొన్నారు. ఏమాత్రం వాటిని నిర్లక్ష్యం చేసినా భవిష్యత్ తరాలకు ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకు ముందు జీవ వైవిధ్య అవగాహన, పరిరక్షణ, నిబద్ధతకు సంబంధించి జీవ వైవిధ్య హైదరాబాద్ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో 28 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 72 మంది విద్యార్థులు, ఎన్విరాన్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అమద్ నాదిమ్, బయోడైవర్సిటీ బోర్డు సెక్రటరీ ఖాళీ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Comments
Please login to add a commentAdd a comment