
శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలి
తుక్కుగూడ: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. మున్సిపల్ కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తుక్కుగూడ మున్సిపల్ కేంద్రంలో మార్చి 11న జిల్లా స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సదస్సుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రొఫెసర్ హరగోపాల్ తదితర ముఖ్య నేతలు హాజరు కానున్నట్టు చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, పానుగంటి పర్వతాలు, దత్తు నాయక్, చంద్రశేఖర్‌రెడ్డి, రాజు, దేవేందర్‌గౌడ్, బ్రహ్మచారి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment